హాలియా మున్సిపాలిటీలో రేపు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

హాలియా మున్సిపాలిటీలో రేపు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

NLG: హాలియా పురపాలక సంఘ పరిధిలో 4 కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికను రేపు ఉ.11 గంటలకు మున్సిపల్ కార్యాలయ మీటింగ్ హాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 4 సభ్యుల ఎంపిక కోసం 28 దరఖాస్తులు రాగా, అందులో మైనారిటీ వర్గాల నుంచి 18, ప్రత్యేక కేటగిరీ కింద 10 దరఖాస్తులు అందినట్లు ఆయన పేర్కొన్నారు.