బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. వ్యక్తి దుర్మరణం

బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. వ్యక్తి దుర్మరణం

NLR: బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్ఐ శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేశ్ (40) బైక్‌పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.