ఆసుపత్రినితనిఖీ చేసిన ఎమ్మెల్యే

ELR: బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల యోగక్షేమాలు అలాగే వైద్య సేవలు అందే తీరును నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు.