రెండు బైక్‌లు ఢీ.. యువకుడు స్పాట్‌డెడ్

రెండు బైక్‌లు ఢీ.. యువకుడు స్పాట్‌డెడ్

ADB: బేలలో గణేష్ గార్డెన్ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మండలానికి చెందిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు.