VIDEO: ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

కోనసీమ: కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు చిన్నారులు ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులను ఆలయ ఈఓ అభినందించి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.