పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన వినయ్ భాస్కర్

WGL: గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని 58వ డివిజన్ పారిశుద్ధ్య సిబ్బందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఘనంగా సన్మానించారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు పాల్గొన్నారు.