వెంకయ్యతో భేటీ అయిన మాజీ మంత్రి దేవినేని

CTR: మాజీ మంత్రి దేవినేని ఉమా శనివారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. హైదరాబాద్‌లోని వెంకయ్య నివాసానికి వెళ్లిన ఉమా, తన కుమారుడి వివాహానికి శుభలేఖ ఇచ్చి ఆయన కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కొద్దిసేపు వెంకయ్యతో తాజా రాజకీయ, సామాజిక అంశాల గురించి ఉమ చర్చించారు.