'బల్క్ డ్రగ్ పార్క్‌కు భూములు ఇవ్వం'
AKP: నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్‌కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని దొండవాక, పెదతీనార్ల మత్స్యకారులు రైతులు స్పష్టం చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు నేతృత్వం వహించారు.