VIDEO: 'ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియం చేసుకోవాలి'
WNP: న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి సివిల్ జడ్జ్ కార్తిక్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కొత్త బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రజలకు న్యాయ సేవలు అందించడమే లక్ష్యమన్నారు.