'మాండవ్య నది బఫర్ జోన్‌లో అక్రమాలు తొలగించాలి'

'మాండవ్య నది బఫర్ జోన్‌లో అక్రమాలు తొలగించాలి'

అన్నమయ్య: రాయచోటిలోని మాండవ్య నది బఫర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బఫర్ జోన్‌లో నిర్మాణాలు నది సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారి భవిష్యత్తులో వరదల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.