సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ASF: సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తాను ఓడిపోతాననే  భయంతో BRS బలపరిచిన అభ్యర్థి బొమ్మేళ్ల రాజయ్య పురుగులమందు తాగాడు. తన దగ్గర పంచడానికి డబ్బులు లేవంటూ ఆవేదన చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.