వైభవంగా కళ్యాణ మహోత్సవం
SDPT: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోనీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మచ్చ గణేష్, భక్తులు పాల్గొన్నారు.