ప్రశంస పత్రాన్ని అందుకున్న అమలాపురం ఆర్డీవో
కోనసీమ: మొంథా తుఫాన్ విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యలు అందించడంలో ముఖ్యపాత్ర పోషించిన అమలాపురం ఆర్డీవో మాధవిని సీఎం చంద్రబాబు అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ఆమెకు సీఎం చంద్రబాబు శనివారం ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఆర్డీవో మాధవిని ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్, తదితరులు అభినందించారు.