శరీరంలో బ్లేడ్ ఉంచిన వైద్యులపై సస్పెన్షన్ వేటు
AP: కాకినాడలో శరీరంలో బ్లేడును ఉంచి వైద్యులు శస్త్ర చికిత్స చేసిన ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. ఆర్థోపెడిక్ సర్జన్ సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతిని సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.