వేడినీళ్లు పడి మూడేళ్ల బాలుడు మృతి
GDWL: అయిజ పురపాలక పరిధిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బబ్లూ అనే మూడేళ్ల బాలుడిపై వేడి నీళ్లు పడటంతో 50% శరీరం కాలిపోయింది. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.