తొలిరోజు 331 మంది విద్యార్థుల గైర్హాజరు

తొలిరోజు 331 మంది విద్యార్థుల గైర్హాజరు

NLG: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన ప్రథమ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అరబిక్ పరీక్షలకు 3,641 మంది విద్యార్థులకు గాను 3,400 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అరబిక్ పరీక్షలకు 1,073 మందికి 983 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.