'అందరి సహకారంతో చెరువుగట్టు అభివృద్ధి'
NLG: అందరి సహకారంతో నార్కట్ పల్లి మండలం చెరువుగట్టును అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ నేతకాని కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లో మొదటిసారి చెరువుగట్టు గ్రామ సర్పంచిగా పనిచేశానని... మళ్లీ ఈసారి కూడా తనను సర్పంచిగా భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 22న నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.