గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నర్సయ్య పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని గ్రంథాలయంలో రూ.10 లక్షల మున్సిపల్ నిధులతో శౌచాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. గ్రంథాలయాల్లో అన్ని పుస్తకాలు సమకూరుస్తామని పేర్కొన్నారు.