కాకతీయ మ్యూజికల్ గార్డెన్- అందమైన వినోద ప్రదేశం
వరంగల్‌లో ఉన్న ప్రసిద్ధ వినోద ప్రదేశాలలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఒకటి. కాకతీయుల చరిత్రకు ప్రసిద్ధి చెందిన నగరంలో ప్రజలకు వినోదం కల్పించేందుకు ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 15-18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్‌లో మ్యూజికల్ ఫౌంటెన్ షో పర్యాటకులను ఆకర్షిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ్లలో సందర్శించడానికి ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం.