నేలకొండపల్లిలో 'బడిబాట' కార్యక్రమం

నేలకొండపల్లిలో 'బడిబాట' కార్యక్రమం

KMM: నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో బుధవారం 'బడిబాట' కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఆనంద్ రావు, వెంకటరావు, స్కూల్ చైర్‌పర్సన్ చంద్రావతి ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యా విధానం ఉందని వివరించారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు కోరారు.