VIDEO: జిల్లాలో మండిపోతున్న ఎండలు

VIDEO:  జిల్లాలో మండిపోతున్న ఎండలు

 సూర్యాపేట జిల్లాలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 36°C దాటడంతో, మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.