రోడ్డు ప్రమాదం .. కారును ఢీకొన్నలారీ

రోడ్డు ప్రమాదం .. కారును ఢీకొన్నలారీ

కృష్ణా: చల్లపల్లిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని ఎన్టీఆర్ గ్రామ పంచాయతీ పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక లారీ అదుపుతప్పి కారును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ మహిళ తీవ్రగాయాలకు గురైంది. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు 108 అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందచేశారు.