శామీర్‌పేట్ హైవే పై భద్రతా చర్యలపై వినతి

శామీర్‌పేట్ హైవే పై భద్రతా చర్యలపై వినతి

మేడ్చల్: శామీర్‌పేట్ గ్రామ జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని బీజేపీ నాయకులు తూంకుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. రాజీవ్ రహదారి మలుపుల్లో ప్రమాదాలు అధికమని, వాటిని తగ్గించేందుకు రేడియం స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి, రోడ్డు భద్రత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.