ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిపేందుకు చర్యలు

NLG: అందరూ సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. NLG మండలం గుట్టకింది అన్నారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి కొనుగోలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు కూడా కేంద్రం సిబ్బందికి సహకరించాలని సూచించారు.