'యువజన ఉత్సవాల్లో యువత ప్రతిభ చాటాలి'

'యువజన ఉత్సవాల్లో యువత ప్రతిభ చాటాలి'

ASF: యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం ఆదివాసీ భవన్‌లో జిల్లా యువజన, క్రీడాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభ ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు అద్భుత వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.