'జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం'
సత్యసాయి: జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటలకు జిల్లాలోని 2,70,966 మంది లబ్ధిదారులకు 184.70 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 54 సచివాలయాల్లో 4349 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు.