నర్సిరెడ్డి పల్లెలో పొలంబడి కార్యక్రమం

నర్సిరెడ్డి పల్లెలో పొలంబడి కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని నర్సిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ మాట్లాడుతూ.. తురిమెళ్ళ రెవెన్యూ గ్రామ పరిధిలో కంది పంట సాగు చేసిన 30 మంది రైతులను ఎంపిక చేసుకొని వారికి 14 వారాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో అధిక దిగుబడులు సాధించుటకు మెలకువలు తెలియజేస్తామన్నారు.