భారతీయుల ప్రాణాలతో కాంగ్రెస్ ఆటలాడుతోంది: మోదీ
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఓట్ల రాజకీయం కోసం కోటి మంది భారతీయుల ప్రాణాలను ఆ పార్టీ పణంగా పెడుతోందని మండిపడ్డారు. యుద్ధ ప్రభావం భారత్‌పై పడకుండా తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. కేరళకు చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని.. వారి భద్రత కోసం ఎంబసీలు 24 గంటలు పని చేస్తున్నాయన్నారు.