VIDEO: విద్యుత్ కాంతులతో యనమలకుదురు ఆలయం

VIDEO: విద్యుత్ కాంతులతో యనమలకుదురు ఆలయం

కృష్ణా: మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. గురువారం ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సర్వాంగసుందరంగా అలంకరించారు. దీపాల వెలుగుల్లో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.