రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించనున్న ఎమ్మెల్యే
BDK: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ రెసిడెన్షియల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇవాళ ప్రారంభించనున్నట్లు జూలూరుపాడు కాంగ్రెస్ నాయకులు మాలోత్ మంగీలాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నట్లు తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.