మటన్ వ్యాపారి ఇంట్లో దొంగతనం
HNK: పరకాల పట్టణంలోని మటన్ వ్యాపారి ఫయీమ్ ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగల గొట్టి ఇంట్లోకి ప్రవేశించి మూడు తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక లక్ష రూపాయల నగదును అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.