'అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలి'

'అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలి'

ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న వంతెనలు, రహదారులు, అదనపు గదులు, నూతన భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, PM జుగా పథకం కింద చేపట్టిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే EGS కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు.