గాజు మహేందర్‌కు ‘ఉత్తమ డ్రైవర్’గా గుర్తింపు
వరంగల్ ఒకటో డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ గాజు మహేందర్ ఉత్తమ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం డిపో మేనేజర్ అర్పిత ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అవార్డు తన క్రమశిక్షణ, బాధ్యతాభావానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు మహేందర్ తెలిపారు. ఇక ముందూ మరింత నిబద్ధతతో సేవలు అందిస్తానని చెప్పారు.