డీజీసీఏ కీలక నిర్ణయం
డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రయాణాలకు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్‌ను తాత్కాలికంగా సవరించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 36 గంటలుగా ఉన్న విరామ సమయాన్ని 48 గంటలకు పెంచినట్లు తెలిపింది. పని ఒత్తిడి వల్ల సర్వీసులకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది.