VIDEO: కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. నిలిచిన రాకపోకలు

ASR: చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారి మధ్యలో, రాజుపాకలు కొండవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. హైవే నిర్మాణంలో భాగంగా అక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం కురుస్తున్న భారీ వర్షానికి కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకల కోసం తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది.