VIDEO: పులుకుర్తిలో కాంగ్రెస్ సర్పంచ్ ప్రచారంలో ఎమ్మెల్యే
HNK:దామెర మండలం పులుకుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లం స్వప్న వేణుగోపాల్‌తో పాటు వార్డు మెంబర్ల గెలుపు కోసం సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పాలన అవసరమని పేర్కొంటూ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.