మార్కాపురం జిల్లా.. అంతా ఇదే మాట!

ప్రకాశం: మార్కాపురం జిల్లా కానుందనే టాక్ జోరందుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవడమే. అయితే, మార్కాపురంను జిల్లాగా ప్రకటన చేయాలన్న కల ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సాక్షాత్తు CM చంద్రబాబు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ప్రజల నోట ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.