VIDEO: వరంగల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు...!
WGL: వరంగల్ కోర్టుకు గురువారం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కోర్టులో బాంబ్ ఉందని మెయిల్ వచ్చింది. సుబేదారి ఇన్స్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ సిబ్బందితో కలిసి వెంటనే అలర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో చేరి పూర్తి తనిఖీలు చేపట్టగా, భయాందోళన కారణంగా సిబ్బంది, మరికొద్ది ప్రజలను భద్రత కోసం బయటకు తరలించారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చింది అనే కోణంలో విచారణ చేపట్టారు.