'టమాటా రైతులను ఆదుకోండి'

'టమాటా రైతులను ఆదుకోండి'

AKP: జిల్లాలో టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు తెలిపారు. మార్కెట్లలో రైతులు తెచ్చిన టమాటా పంటను కొనుగోలు చేసే వారు లేక నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు.