వర్షంలో యూరియా కోసం రైతుల పడిగాపులు

NRPT: నర్వ మండలంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో యూరియా నిల్వ ఉందన్న సమాచారంతో రైతులు ఆదివారం ఉదయం నుంచే వర్షంలో బారులు తీరారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో రైతులు రావడంతో కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. యూరియా కొరతను తీర్చి, తమకు తగినంత ఎరువును అందించాలని రైతులు డిమాండ్ చేశారు.