ఘనంగా గరుఢ పంచమి ఉత్సవం

ఘనంగా గరుఢ పంచమి ఉత్సవం

RR: షాద్‌నగర్‌ పట్టణానికి ముఖద్వారంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గరుఢ పంచమి ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఏకశిలా విగ్రహంలో ఉన్న గరుఢ, హనుమాన్‌ విగ్రహాలకు అభిషేకం చేసి, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరై పూజలు చేశారు.