అద్దాల మందిరం వద్ద క్షీరాబ్ది ద్వాదశి పూజలు
SDPT: గజ్వేల్‌లోని అద్దాల మందిరం వద్ద కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. కాగా, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకులు రామకోటి రామరాజు తులసి మాతకు, ఉసిరి మొక్కకు ప్రత్యేక అభిషేకం పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటిలో ఉన్న తులసికోట వద్ద శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమానులైన తులసిని పూజిస్తే సకల శుభాలు కల్గుతాయన్నారు.