హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
TG: హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. తాజాగా కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న రైల్వే వంతెన కింద వరద నీరు భారీగా చేరడంతో తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.