చింతనెక్కొండలో అరటి రైతులకు అవగాహన కార్యక్రమం
WGL: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో MIDH పథకంలో భాగంగా ఇవాళ సంగెం మండలం చింతనెక్కొండ గ్రామంలో సంగని ఐలయ్య వ్యవసాయ క్షేత్రంలో అరటి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోత దశలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం, సస్య రక్షణ, ఎరువులు, నీటి నిర్వహణపై జిల్లా ఉద్యాన అధికారి రాజశ్రీ వివరించారు.