లాడ్జిలో ఉరివేసుకొని ఇంజనీర్ ఆత్మహత్య

లాడ్జిలో ఉరివేసుకొని ఇంజనీర్ ఆత్మహత్య

SKLM: రణస్థలం(M) పైడి భీమవరంలోని ఓ లాడ్జిలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 4 నెలలుగా ఈ లాడ్జిలో ఉంటున్న ఆయన బుధవారం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టంగా తలుపులు తెరిచారు. మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ గా గుర్తించారు.