'పకడ్బందీగా అవెన్యూ ప్లాంటేషన్‌ను నిర్వహించాలి'

JGL: పకడ్బందీగా ఆవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో సలీం అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలోని నర్సరీ, ఆవెన్యూ ప్లాంటేషన్‌ను ఎంపీడీవో సోమవారం పరిశీలించారు. నర్సరీలో పెరిగిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటించాలని పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. నాటిన మొక్కల మధ్య పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు.