ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

NGKL: కార్తీక మాసంలో చివరి సోమవారాన్ని పురస్కరించుకుని జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  నియోజకవర్గంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ మరియు అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారిని దర్శింపజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.