ఆర్టీసీ వినూత్న సేవా కార్యక్రమం

PDPL: TSRTC వినూత్న సేవాకార్య క్రమం “యాత్రాదానం” ను ప్రారంభించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. దాతలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరుపేద విద్యార్థులు, దివ్యాంగులు, నిరాశ్రయ వృద్ధులు దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు సందర్శించే అవకాశం పొందుతారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి ప్రత్యేక దినాల్లో ఈ యాత్ర ద్వారా ఆనందాన్ని పంచుకోవచ్చున న్నారు.