జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. కలెక్టర్
MLG: జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ దివాకర టీఎస్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలు కాపాడుతూ హోలీని ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆకాంక్షించారు. పరస్పరం ప్రేమ, సౌహార్దంతో వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.