నేడు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్
SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చని MLA తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.